గుర్‍మెహర్‍లో విషం నింపిందెవరు?

Sharing is caring!

 Original Author: Ravinar, MediaCrooks.com            Telugu Translation: C. Raghothama Rao


Read original article on MediaCrooks.com – Link >> Who poisoned Gurmehar


 

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ “ఫిబరల్స్” ఓడిపోతున్నారు.

సమకాలీన స్థితిగతులకు అనుగుణంగా ఉండడంలో వారు విఫలమవుతున్నారు. ఈ ఫిబరల్స్ లానే లంచగొండి కామ్మీ మీడియా కూడా ఓడిపోతోంది. మనదేశంలో ఈ పరిస్థితి మరింత పెద్దస్థాయిలో కొనసాగుతోంది. ఇక్కడ కామ్మీలు అనేక రూపాల్లో కనిపిస్తుంటారు – కాంగ్రెస్, TMC, CPM, RJD మొదలైనవన్నీ కాస్త అటు ఇటుగా కామ్మీ కలుపుమొక్కలే. వీరిని అంటకాగే మీడియా వర్గం ఒకటుంది. ఒక్కమాటలో వీరందరిని కలిపి “సిక్యులర్స్” అని పిలుస్తుంటాం. కేంద్రప్రభుత్వ పతనానికై ఈ సిక్యులర్స్ అందరూ కలసికట్టుగా పనిచేస్తుంటారు. రోజుకొక కొత్త పథకాన్ని అమలుపెడుతుంటారు. అయినదానికి కానిదానికి ప్రధాని మోడిని ఆడిపోసుకోవడం, గందరగోళాల్ని సృష్టించడం, అల్లర్లని రెచ్చగొట్టడం మొదలైనవన్నీ వీరి పథకాల్లోని భాగాలే!

మార్చ్ 2014 నుండి హింస, ఘర్షణలతో కూడిన వాతావరణాన్ని నిర్మించే ప్రయత్నంలో ఈ సిక్యులర్స్ తలమునకలైవున్నారు. ’క్రిస్టియన్లపై దాడులు’, ’రోహిత్ వేముల’, ’దాద్రి’ల మీదుగా ఇప్పుడు వీరు ’గుర్‍మెహర్’ అనే ఓ అమ్మాయి దాకా సాగివచ్చారు. ఈ అమ్మాయి గురించి ఇప్పటికే చాలామంది చాలా చాలా వ్రాసారు. కనుక, నేను ఎక్కువగా చెప్పదల్చుకోలేదు. నేను ’మెహర్’ అని పిలువబోయే ఈ గుర్‍మెహర్ కౌర్‍ను అడ్డుపెట్టుకుని మీడియావారు, కామ్మీలు, సిక్యులర్స్ ఎటువంటి కుట్రను పన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2016 నుండే రాహుల్‍ గాంధి తన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టాడు. “ఖాత్ సభలు” అన్న పేరుతో మొదలైన ఈ ప్రచారం తరువాత్తరువాత అఖిలేశ్ యాదవ్ నుండి అప్పు తెచ్చుకున్న సైకిల్ పై కొనసాగింది. ఎందుకంటే రాహుల్ సభకు తీసుకొచ్చిన ఖాత్ (మంచాలు)లను అక్కడకు వచ్చిన వారిలో కొందరు ఎత్తుకెళ్ళిపోయారు కనుక!

రాహుల్‍ ప్రచారానికి తద్విరుద్ధంగా నరేంద్ర మోడి, అఖిలేశ్, మాయావతిలు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ప్రచారం మొదలెట్టారు. యుపి ఎన్నికలతో బాటే పంజాబ్, గోవా, ఉత్తరాఖండి, మణిపూర్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బిజెపి వారి ప్రయత్నాలకు గండి కొట్టే వ్యవహారం చాలా రోజుల క్రితమే మొదలయింది. వీటన్నింటి మధ్యన, ఉన్నట్టుండి, మెహర్ ఊడిపడడం, వెనువెంటనే వెలుగులోకి రావడమనేది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఈ అమ్మాయి చెబుతున్న పసలేని మాటల ద్వారా ఆమె చేత ఆ మాటల్ని ఎవరు పలికిస్తున్నారో నేను ఊహించగలను:

ఋజువు కోసం మనమేమీ యుగాల తరబడి ఎదురుచూడాల్సిన పనే లేదు. ఇదిగో…ఈ ట్వీట్‍ను చూడండి! భారతదేశాన్ని, హిందువుల్ని అణువణువునా ద్వేషించే రాణా అయ్యూబ్ చేసిన ఈ ట్వీట్‍ను ఎందరో ట్వీపుల్స్ చూసివున్నారు. ఈ ట్వీట్‍లో అయ్యూబ్ అతిశయోక్తులతో మెహర్‍ను “శాంతిదూత”గా పొగిడింది.

విద్వేషి ఐన రాణా అయ్యూబ్ ఎవరినైనా పొగిడిందంటే – అదొక ప్రమాద హెచ్చరిక.

ట్వీట్‍ను మరొక్కసారి చూడండి! మే 2, 2016 నాడు చేసిన ట్వీట్ అది!

ఆహా! ఇంతకు ముందు నేను అనుమానించినట్టుగానే పాకిస్తాన్ ప్రేమికులనబడే మూర్ఖులను కనిపెట్టి, వారిని తీర్చిదిద్దే బర్ఖాదత్ కూడా మెహర్ వెనుక ఉంది. ఆ అమ్మాయితో ఓ ఇంటర్వ్యూను వెలగబెట్టింది కూడా. ఇహ ఇక్కడి నుండి కథ మొత్తం సులువుగా, సుతారంగా సాగిపోవాల్సిందే. మెహర్‍లోని ’ప్రతిభ’ను ఇట్టే గుర్తించిన బర్ఖా ఆ అమ్మాయిని ’బకరా’ను చేసి, నంజుకు తినడానికి తయారైపోయింది. గతంలో ఇదే ప్రయత్నాన్ని బర్ఖా చాలామందిపై ప్రయోగించింది. పప్పు, పప్పిణి, కన్హయ్యాలాల్, హిల్లరీ ఇలా పెద్ద లిస్టే ఉంది. వీరు చాలరన్నట్టుగా ఉద్ధవ్ థాకరేను కూడా ఉద్ధరించడానికి కృషి చేసింది కానీ ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. నా అంచనా ప్రకారం బర్ఖాదత్ మెహర్‍ను తన సేవకుడైన కేజ్రీవాల్ సంరక్షణలో ఉంచివుండవచ్చు. ఇలాగైతే ఇక వెలుగులోకి రావడానికి పెద్దగా సమయం పట్టదు. మెహర్‍కు బర్ఖాదత్ ఇంటర్వ్యూకు మునుపే ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చివుంటుంది. ఇందులో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఆవిధంగా “నా మాటలు నీవిగా చేసుకొని చూడు” అని బర్ఖా అనడం, NDTV ఇంటర్వ్యూలో మెహర్ చిలకపలుకులు పలకడం జరిగిపోయాయి. మెహర్ చిలకపలుకులను ఈ ట్వీట్స్‍లో చూడొచ్చు:

అన్నిటికంటే ముఖ్యంగా, మెహర్ గురించి “ఆమె కార్గిల్ అమరవీరుని కుమార్తె” అంటూ బర్ఖాదత్ ఓ పెద్ద అబద్ధాన్ని చెప్పింది.

ఒక పదిహేడేళ్ళ అమ్మాయిని వల్లో వేసుకోవడానికి ఇంతకంటే వేరే ’సెంటిమెంటల్ ట్రాప్’ వేరేవుందా? నిజానికి మెహర్ ఒక మృతవీరుని కుమార్తే. కానీ ఆమె తండ్రి బర్ఖా చెప్పినట్టు ’కార్గిల్’ వీరుడు కారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఆగష్ట్ 1999లో, టెర్రరిస్టులతో జరిగిన కాల్పుల్లో మెహర్ తండ్రి చనిపోయారు. ఈ నిజం చెప్పడం కంటే కూడా “కార్గిల్ అమరవీరుడు” అన్న అబద్ధాన్ని చెప్పడంలో ఉండే నాటకీయత, విలువ చాలా ఎక్కువ. అందుకనే మీడియా క్రిమినల్స్ అసలు నిజాన్ని దాచిపెట్టారు. మెహర్ కూడా ఈ అబద్ధాన్ని టక్కుమని పుక్కిట పట్టేసింది. ఇలా అబద్ధాన్ని మింగి జీర్ణించుకోవడమే ఆలస్యం, తతిమ్మా వ్యవహారం (బర్ఖా కోచింగ్, ఎన్డిటివి ఇంటర్వ్యూ) నల్లేరు మీద నడకలా సాగిపోయింది. ఇదంతా నేను ఊహించదానికి సరిగ్గ సరిపోయింది.

అసలు నిజం గురించి ట్విటర్‍లో ప్రజలు నిలదీసి అడిగితే, “ఆ అమ్మాయి తన తండ్రి కార్గిల్ అమరుడని చెప్పింది. నేను నమ్మాను” అని వాక్రుచ్చింది బర్ఖా. ఇందుకు సాక్ష్యంగా మెహర్ పోస్ట్ చేసిన ఓ యూట్యూబ్ వీడియోను చూపించింది. ఈ యవ్వారమంతా మే 2, 2016నే జరిగింది. అంటే, మే 3, 2016 నాడు మెహర్ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోను, మే 2 తారీకునే బర్ఖా చూసేసిందన్న మాట! అద్భుతం…పరమాద్భుతం!

మే 2, 2016 న NDTV లో ప్రసారమైన తన ఇంటర్వ్యూ తరువాత, మే 3, 2016న ఆ ఇంటర్వ్యూలో తాను పలికిన చిలకపలుకుల్నే ఏర్చి కూర్చి ఓ ప్లకార్డ్ వీడియోను యూట్యూబ్ లో పెట్టింది మెహర్. ఈ వీడియో నేను క్రితంలో వ్రాసిన “Fiberal Artyfarts” (అపానవాయువీయులు అనబడే Fiberal Artyfarts) లో పెట్టిన మైమ్ వీడియోలా ఉంటుంది. ఆ వీడియోలో మెహర్ చెప్పే మాటలన్నీ NDTV ఇంటర్వ్యూలోనివే! ఉదాహరణకు, ఈ ఇమేజ్‍ను చూడండి:

ఆరేళ్ళ పసిపాప ఒకరిని కత్తితో పొడిచి చంపాలనుకోవడం?

అబ్బో ఎంత ధైర్యం? కదూ!

ఆ వయసులో నేను గోలీలు, కబడ్డీ ఆడడం, చిల్లర డబ్బుల కోసం నాన్నగారిని దేబిరించడం చేసేవాణ్ణి. ఈనాటి ఫిబెరల్ యువతరం మాత్రం చాలా ఎదిగిపోయింది. ఆరేళ్ళకే ఒకర్ని చంపాలని అనుకునేంతగా ఎదిగిపోయింది. ఒకవేళ ఈ చెత్తంతా కట్టుకథ కాకపోతే నేనొక Darth Vader నే!

ఇదంత కట్టుకథే! మిమ్మల్ని బాధలోను, ఆవేదనలోనూ ముంచడం కోసం కనిపెట్టిన కనికట్టు. ఓ ఆరేళ్ళ పసిపాపలో రేగే ’సంవేదన’ల్ని అతిగా చిత్రీకరించేందుకు చేసిన కుట్ర. అతి నాటకీయత, మితి మీరిన నటన – ఇవి బర్ఖా దత్ కే సాధ్యమైనవి. కనుకనే మెహర్ బర్ఖాను ’ప్రేరణ శక్తి’గా భావిస్తోంది!

రామజాస్ కాలేజ్ కామ్మీ గుంపైన AISA, ABVP మధ్య జరిగిన జగడం తరువాత కుహనా ఆరోపణలెన్నింటినో సృష్టించడం జరుగుతోంది. JNU కు చెందిన కామ్మీ మూర్ఖుల్ని “విద్యార్థులు” అని, ABVP వారిని “గూండాలు” అని చెప్పడం జరుగుతోంది. ’గూండా’ పట్టంతో ఆగకుండా “హిందూ తీవ్రవాదు”లన్న ఆరోపణల్ని సైతం చేయడానికి వెనకాడ్డం లేదు కొద్దిమంది ’మానసిక రోగులు.’

ఐతే, ఏదీ ఇక్కడితో ఆగడం లేదు.

చిన్నారి మెహర్ ఇంకా ముందుకు సాగాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ’అతిపాపిష్టి’ గా పేరు సంపాదించుకొన్న అరవింద్ కేజ్రీవాల్‍ పట్ల ఈ చిన్నారికి అమితమైన పూజాభావం ఏర్పడింది. ఈ కారణం చేత, తన గురువు (కేజ్రీవాల్)లానే, డీమనిటైజేషన్ గురించి ప్రధానికి మోడిని ఎకెసెక్కెం చేసింది:

పై ఇమేజ్ లోని మెహర్ మాటల్ని ’హాని చేయని హాస్యం’ క్రింద కొట్టిపారేయొచ్చు.

రామజాస్ ఘటన తర్వాత ABVP వారు గూండాలనే ప్లకార్డ్ ఒకటి పట్టుకుని, తాను వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు, దేశంలోని అందరు విద్యార్థులు తన పక్షాన ఉన్నట్టుగా చెప్పుకొంది. తాను భావప్రకటనా స్వేచ్ఛకు, వాక్‍స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నట్టుగా చెప్పుకొంది. ఇవన్నీ ఒక విద్యార్థికి ఎందుకూ కొరగాని మాటలే! ఐతే, మొత్తం సిక్యులర్ ముఠాకు ఈ మాటలే చాలనిపించాయి. వెంటనే ఆ అమ్మాయి “ధైర్యా”న్ని పొగిడేసాయి. మెహర్ ’టైగర్ హిల్’ను మరొక్కసారి ఆక్రమించుకుందేమో అన్నంతగా సందడి చేసాయి సిక్యులర్ ముఠాలు. ఇదే సమయంలోనే మెహర్ పట్టుకున్న “Pak didn’t kill my dad – War did” అన్న ప్లకార్డ్ బయటకు వచ్చింది. దాంతో, రైట్ వింగర్స్‍గా పిలువబడే ప్రజలు విరగబడి పేరడీలు వ్రాసారు. చివరకు ఈ ప్లకార్డ్ వ్యవహారం హాస్పాస్పదమైన కామెడీ షోగా మారింది. జోకులు, పేరడీలు దావానలంలా ట్విటర్లో వ్యాపించాయి. ప్రజలు మాత్రం పాకిస్తానీ హంతకుల్ని సమర్థిస్తున్న అమరవీరుని కూతుర్ని చూసి నివ్వెరపోయారు. కార్గిల్ యుద్ధంలో మరణించకపోయినా తీవ్రవాదుల చేతుల్లో మరణించిన మెహర్ తండ్రి అమర వీరుడే!

సోషియల్ మీడియాలోని కొందరు విలక్షణమైనవారు. వీరు ’త్రవ్వకాలు’ జరపడంలో దిట్టలు. ఆవిధంగా, వారు మెహర్ గతానికి చెందిన అనేక విషయాలను త్రవ్వి, తోడి, కూపి తీసి పెట్టారు. గతంలో ఆమె రాసిన రాతలు, పలికిన పలుకులు, కేజ్రీ సహవాసం – ఇలా అన్నీ బయటపడ్డాయి. SM-freaks త్రవ్వకాల్లో వెలుగు చూసిన కొన్ని నిజాలు నివ్వెర పరిచేవిగా ఉన్నాయి. మెహర్‍కు భారతదేశ వ్యతిరేకులైన మావోయిస్టులతోను, దేశద్రోహులతోను పరిచయాలున్నాయి. కవితా కృష్ణన్, షబ్నమ్ హష్మి, జాన్ దయాళ్ వంటి వారు సృష్టించిన “యుద్ధవ్యతిరేకత” అనే షోలో ఈమెకూ భాగముంది. మెహర్ ప్లకార్డ్‍ పై జోకులు వేసిన వారిలో వీరేంద్ర సెహవాగ్, రణదీప్ హూడా, యోగేశ్వర దత్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. మీడియాలోను, రాజకీయాల్లోనూ ఉండే సిక్యులర్లు వీరిని ’ధూర్తు’లని తిట్టిపోసారు. దీనిపై కూడా ఎన్నో జోకులు సోషియల్ మీడియాలో పేలాయి.

చూడగా చూడగా “భావ ప్రకటన” స్వేచ్ఛ ఒక్క కామ్మీ మందలకే పరిమితమైనట్టు ఉంది. వారిపై ఎవరైనా ఛలోక్తులు విసిరడం, తమాషాగా మాట్లాడం వారికి అసలు నచ్చదు. ఒప్పుకునే సహనం లేదు. మావోలా, యేచూరిలా, డి. రాజాలా ఈ కామ్మీలు కూడా ఎప్పుడూ ’యమా సీరియస్సు!”

జోకులు, సెటైర్లు, వెక్కిరింపులు ఎక్కువయే సరికి మెహర్ & NDTV మరొక అసత్య ప్రచారంతో ముందుకొచ్చాయి. అదే “మెహర్‍ను చంపేస్తామనే హెచ్చరికలు, మానభంగం చేస్తామనే బెదిరింపులు” రావడం. ఓ స్త్రీ మాత్రమే చేయగల సులభైమన ఆరోపణలివి. ఇది కూడా బర్ఖా ప్రసాదించిన ప్రేరణే అయివుండాలని నా ఊహ. ఎందుకంటే, బుద్ధి తక్కువైన మాటలు మాట్లాడం, ఆ మాటల్ని ఎవరైనా నిక్కచ్చిగా ఖండిస్తే “వా….” అంటూ దొంగ ఏడ్పులు ఏడవడం బర్ఖాకు అలవాటే. నా అంచనా ప్రకారం ఈ కామ్మీలు ఓ అమ్మాయిని ఎంచుకోవడంలోని అసలు మర్మం ఇదే. తనను మానభంగం చేస్తామనే బెదరింపులొచ్చాయని కన్హయా లాల్ చేయలేని ఆరోపణలను ఒక స్త్రీ సులభంగా చేయగలదు. అలా తనకు రేప్ థ్రెట్స్ వచ్చాయని చెప్పిన మెహర్ పోలీసుల వద్దకు వెళ్ళలేదు. బదలుగా స్వాతి మలివాల్ అనే మరో ఆపిస్టు రాజ్యమేలుతున్న ఢిల్లీ మహిళా కమీషన్‍కు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‍ను కలిసి మెహర్‍ను మానభంగం చేస్తామని బెదరించిన ABVP పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ చూపిన వేగానికి వేరే ఏ అర్థాన్ని చెప్పవచ్చు?

కనుక, పై విషయాల నేపధ్యంలో ఏయే పార్టీలు మెహర్‍ను దువ్వుతున్నాయో, వెలుగులోకి తీసుకువస్తున్నాయో, మరో “కన్హయా”గా ప్రోత్సహిస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఒక అమరవీరుని కూతురు బుద్ధిని ఇలా విషపూరితం చేసి, పావులా వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. “యుద్ధం – శాంతి” వంటి సున్నితమైన అంశాలపై తప్పుదారిని పట్టించడం విషాదకరం. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఇలా ప్రశ్నించడం ఎంతో సబబు:

“పాకిస్తాన్ తన తండ్రిని చంపలేద”నే ప్లకార్డ్‍ను మెహర్ చేతిలో పెట్టడం, తద్వారా హిందువులు ముస్లిమ్ వ్యతిరేకులనే భావనను రెచ్చగొట్టడమనేది బర్ఖా, కేజ్రీవాల్, ఇతరులు కలిసి పన్నిన తెలివైన కుట్ర. వారి వేసిన ఈ “ప్లకార్డ్ కార్డ్” నీచమైన కుంభకోణం వంటిదే. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలోనే ఇటువంటి మురికి విషయాలు పైకి తేలడం జరుగుతోంది. కామ్మీలు విసిరిన ఈ “కార్డ్” పంజాబ్ ఎన్నికల నాటికి పారకపోయిన ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఉపయోగపడుతుంది. రిజిజు కేవలం “కాలుష్యం” అని అన్నారు. నేను మాత్రం “విషపూరితం” అంటాను. ఏవైనా ఎన్నికలు జరగడమో లేదా సిక్యులర్స్ మానం పోయే సందర్భ ఎదురైనప్పుడో ఈ ’విషపురుగులు’ ఇటువంటి కుతంత్రాలను బరిలోకి వదులుతున్నారు. ఈ ’పురుగులు’ బిజేపిని ’మానభంగాలు’ చేసే పార్టీగా చిత్రీకరించడమే ఆలస్యం, ఈ విదూషకుల పాకీ మిత్రులు ఇలా వ్రాయడం మొదలెట్టారు:

చివరకు, మెహర్ చేసిన “మానభంగం బెదరింపు” ఆరోపణను నిరూపించడం ఆ అమ్మాయి సామర్థ్యాన్ని మీరిపోయింది. ఆ చిన్నారి భుజాలు తను చేసిన ఆరోపణల బరువును మోయలేకపోయాయి. “ధైర్యం”, “సాహసం” ఇవేనని తర్ఫీదుదారులు చెబితే, నిజమేనని భ్రమపడిన మెహర్ చివరకు అసౌకర్యానికి లోనుకావల్సివచ్చింది. బర్ఖా, కేజ్రీ వంటి వారి చేతుల్లో చిక్కుకున్న ఆ చిన్నారి చివరకు సమాజంలో అప్రతిష్ట పాలు కావాల్సివచ్చింది. ఆఖరుకు తాను మొదలెట్టిన (ఏదో ఒక) “ప్రచారం” నుండి తప్పుకుంటున్నట్టుగా ట్వీట్ చేసింది మెహర్. తన ఏకాంతానికి అడ్డుతగలొద్దని విన్నమించింది. కానీ మీడియావారు మాత్రం రెచ్చిపోయారు. మెహర్ ఇలా ట్వీట్ చేయడం “స్త్రీల నోళ్ళను నొక్కేస్తున్న వైనం”కు నిదర్శమని అరచి గీపెట్టాయి.

కాదు. ఇది మహిళల వాక్‍స్వాతంత్ర్యాన్ని హరించే వ్యవహారం కాదు. స్త్రీలు మాత్రమే కాదు, ఎవరి స్వేచ్ఛనూ నొక్కిపెట్టే తతంగం ఏదీ జరగడం లేదు. అసలు సమస్య కామ్మీ ఫిబెరల్స్‍లోనే ఉంది. భావప్రకటన, వాక్‍స్వాతంత్ర్యాలు అందరికీ చెందినవని వారు భావించడం లేదు. చిన్నారి మెహర్ వెనుక ముసుగులో పనిచేసిన ధూర్తులు ఆ అమ్మాయి అమాయకత్వాన్ని, ధైర్యాన్ని దుర్వినియోగం చేసారు. తానే స్వచ్ఛందంగా భావాలను వెల్లడించినట్టు మెహర్ చెబుతున్నా, ఆమె చేత ఆ ప్లకార్డ్‍లను ఎవరు పట్టించారో, వీడియోలను ఎవరు తీయించారో మనమందరం స్పష్టంగా తెలుసుకోవచ్చు. క్షణక్షణం, కణంకణం, ఈ భారతదేశాన్ని ద్వేషించే కవితా కృష్ణన్, షబ్నమ్ హష్మీ, జాన్ దయాళ్ వంటి తోడేళ్ళకు ఆహారంగా మెహర్‍ను ఎవరు బలియిచ్చారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యవిషయం మరొకటుంది. మెహర్ వంటి కీలుబొమ్మలను వెతికి పట్టడానికి కొన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు కామ్మీ తోలుబొమ్మలాటలోళ్ళు . JNU, హైదరాబాద్ యూనివర్సిటీ, జాధవ్‍పూర్ యూనివర్సిటీ లేదా FTII. ప్రస్తుతానికి ఇవి మాత్రమే కామ్మీల చేతిలో మిగిలిన చిట్టచివరి స్థావరాలు. కానీ వారి ద్వేషపూరితమైన రాద్ధాంతాలకు ఇక్కడ కూడా చరమగీతం పాడే సూచనల్ని నేను స్పష్టం చూడగలుగుతున్నాయి.

@@@@@

398total visits,1visits today

Be the first to comment on "గుర్‍మెహర్‍లో విషం నింపిందెవరు?"

Leave a comment

Your email address will not be published.


*